ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా డెల్డాకు ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా సాగునీటిని విదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజికి 1.8 టీఎంసీలు విడుదల చేశామని చెప్పారు. తూర్పు డెల్టాకు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వివరించారు. రైవస్ కాలువకు వెయ్యి క్యూసెక్కులు, బందరు, ఏలూరు కాలువకు 500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

గతంలో ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు లేకపోవడంతో కృష్ణా డెల్టాకు జూన్‌లోనే నీళ్లు వచ్చేవన్నారు.డెల్టా రైతుల తుపాన్ల కారణంగా నష్టపోయారని తెలిపారు. పట్టిసీమ ద్వారా జూన్‌లోనే కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తామన్నారు. జూన్‌లో నీరు ఇవ్వడంతో సకాలంలో పంట వస్తుందని ఆయన అన్నారు. పట్టిసీమను అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించాయని ఆయన చెప్పుకొచ్చారు.