ఎన్.టి.ఆర్. తెనాలిలో థియేటర్ నిర్మాణం వెనుక ఉన్న ఆంతర్యం !!!

► NTR గారు తెనాలిలో రామకృష్ణ థియేటర్ ని నిర్మించారని తెలుసు కదా. ఆ తరువాత వేరే వారికి అమ్మేశారని స్థానిక కథనం. బహుశా మళ్ళీ యాజమాన్యం మారి ఉంటుందో ఏమో కానీ ఈ మధ్యనే ఆ థియేటర్ ని పెమ్మసాని థియేటర్ గా మార్చడం జరిగింది.

► అసలు ఎన్.టి.ఆర్. గారికి తెనాలి లో ఎందుకు థియేటర్ కట్టాలని అనిపించిందో అని స్థలం కొన్నప్పుడు చాలామంది అనుకునేవాళ్ళట. తెనాలిలో ఎందుకు నిర్మిస్తున్నారు అని ఒక మిత్రుడు అడిగితే అసలు విషయం చెప్పారట. ఆయన ఏమన్నారంటే “తెనాలి మా తండ్రి చక్రపాణి గారి ఊరు. అందుకు నిర్మించదలిచాను” అని అన్నారట. చక్రపాణి గారిని ఎన్.టి.ఆర్ పితృసమానులుగా ఎంతో గౌరవించేవారట !!!

► చక్రపాణి గారి గురించి …..: ఆలూరు వెంకట సుబ్బారావు (కలంపేరు చక్రపాణి) ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత మరియు దర్శకుడు.

► ఈయన తెనాలి ఇతానగర్ లో ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి ఎంతో ఎత్తుకు ఎదిగారు. చక్రపాణి, బి.ఎన్.రెడ్డి ఇద్దరూ కలసి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి బి.ఎన్.రెడ్డి తో కలసి పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు.